Monday, May 5, 2025

దుల్కర్ సల్మాన్‌ 40వ సినిమా ప్రారంభం

- Advertisement -
- Advertisement -

దుల్కర్ సల్మాన్ హీరోగా, నహాస్ హిదాయత్ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మకమైన సినిమా ‘ఐ యామ్ గేమ్’ తిరువనంతపురంలో గ్రాండ్ పూజతో షూటింగ్ ప్రారంభమైంది. ఈ చిత్రాన్ని దుల్కర్ సల్మానే తన స్వంత బ్యానర్ వేఫారర్ ఫిలమ్స్‌పై నిర్మిస్తున్నారు. పూజ కార్యక్రమానికి ప్రధాన తారాగణం హాజరయ్యారు. అందులో ప్రముఖ నటులు యాంటోని వర్గీస్, తమిళ దర్శక-నటుడు మిస్కిన్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి కథను సజీర్ బాబు, ఇస్మాయిల్ అబుబక్కర్, బిలాల్ మొయిదు అందించారు. డైలాగ్ రైటర్స్ గా ఆధర్ష్ సుకుమారన్, షహబాస్ రషీద్ పని చేస్తున్నారు. ఇది దుల్కర్ సల్మాన్‌కు 40వ చిత్రం కావడం విశేషం, అలాగే నహాస్ హిదాయత్ బ్లాక్‌బస్టర్ ‘ఆర్‌డిఎక్స్’ తర్వాత దర్శకత్వం వహిస్తున్న ప్రాజెక్ట్ కావడం మరో హైలెట్. తిరువనంతపురంలో చిత్రీకరణ మొదటి షెడ్యూల్ కొనసాగుతోంది. ఇది దుల్కర్ ఇప్పటి వరకు చేసిన మలయాళ చిత్రాలలో అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందుతోంది. ఇందులో హై-వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు ఉండబోతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News