సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న ‘కూలీ’కి(coolie) లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రతిష్టాత్మక సన్ పిక్చర్స్ బ్యానర్ నిర్మించిన కూలీలో కింగ్ నాగార్జున పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్‌ఖాన్ మరో ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. ఇక ఎంతగానో ఎదురుచూస్తున్న కూలీ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. “ఒకడు పుట్టగానే వాడు ఎవడి చేతిలో చావాలో తలమీద రాసిపెట్టి ఉంటుంది”అనే నాగార్జున పవర్ ఫుల్ డైలాగ్ తో మొదలైన ట్రైలర్ పవర్ ప్యాక్డ్ మూమెంట్స్‌తో గూస్ బంప్స్ తెప్పించింది.
“’అడుగు పెడితే విజలు మోగులే’ అనే పవర్ ఫుల్ బీజీఎంతో దేవా పాత్రలో రజనీకాంత్ ఎంట్రీ అదిరిపోయింది. ట్రైలర్ చాలా పవర్ ప్యాక్డ్‌గా (Power packed) వుంది. మొత్తానికి ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలని డబుల్ చేసింది. డి. సురేష్ బాబు, దిల్ రాజు, సునీల్ నారంగ్, భరత్ నారంగ్ యాజమాన్యంలోని ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏషియన్ మల్టీప్లెక్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ కూలీ మూవీ తెలుగు థియేట్రికల్ హక్కులను భారీ ధరకు సొంతం చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలచేయనుంది.