మన తెలంగాణ/ హైదరాబాద్: ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పివిఎల్) సీజన్4 పోటీల కోసం హైదరాబాద్కు విచ్చేస్తున్న అన్ని జట్ల క్రీడాకారులకు, అభిమానులకు, జట్ల యజమానులకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హృద య పూర్వక స్వాగతం పలికారు. గురువారం హైదరాబాద్లోని ఓ హోటల్లో సిఎం పివిఎల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్రీడల మంత్రి వాకి టి శ్రీహరి, శాట్స్ చైర్మన్ శివసేనా రెడ్డి, క్రీడా శాఖ ము ఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, శాట్స్ విసిఎండి సోనీ బాలదేవి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సిఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ క్రీడా రంగం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటుందన్నారు. తనకు క్రీడలంటే ఎంతో మక్కవ అని పేర్కొన్నారు. క్రీడా రంగాన్ని పటిష్టం చేసి రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రానున్న రోజుల్లో హైదరాబాద్ వేదికగా పలు జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడలను నిర్వహించేందుకు ప్రయత్నిస్తామన్నారు. ప్రైమ్ వాలీబాల్ లీగ్ వంటి క్రీడలతో హైదరాబాద్ ప్రతిష్ఠ మరింత పెరుగుతుందన్నారు. వాలీబాల్ లీగ్ పోటీలు సాఫీగా సాగేందుకు ప్రభుత్వం తరఫున నిర్వాహకులకు అన్ని రకాల సహా య, సహకారాలు అందిస్తామని సిఎం భరోసా ఈచ్చా రు.
ఇక వాలీబాల్ లీగ్ నిర్వాహకులను రాష్ట్ర క్రీడల మంత్రి వాకిటి శ్రీహరి అభినందించారు. అక్టోబర్ రెండు నుంచి హైదరాబాద్లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో వాలీబాల్ లీగ్ పోటీలు జరుగనున్నాయని హైదరాబాద్ బ్లాక్ హాక్స్ టీమ్ యజమాని కంకణాల అభిషేక్ రెడ్డి తెలిపారు. ఈ టోర్నీలో మొత్తం 38 జట్లు తలపడుతాయని వివరించారు. టోర్నీ సాఫీగా సాగేందుకు అన్ని రకాల సహాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావడంపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు. తమకు అండగా నిలిచిన సిఎం రేవంత్ రెడ్డికి, క్రీడల మంత్రి వాకిటి శ్రీహరికి, శాట్స్ చైర్మన్ తదితరులకు ఆయన అభిషేక్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.