- Advertisement -
హైదరాబాద్: వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తీసుకొచ్చిన ఖైదీ పోలీసుల కళ్లుగప్పి పరార్ అయ్యాడు. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రెండు రోజుల క్రితం సోహైల్ అనే ఖైదీని పోలీసులు బేగంపేటలో ఓ దోపిడి కేసులో అరెస్ట్ చేశారు. అయితే చర్లపల్లి జైలుకు తరలించే ముందు అతడిని గాంధీ ఆస్పత్రికి తీసుకువచ్చారు. అయితే సోహైల్ వాష్‌రూంలోని వెంటిలేటర్ నుంచి దూకి పారిపోయాడు. పలు కేసుల్లోనూ ఇతడు నిందితుడిగా ఉన్నాడు. ఈ ఘటనపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
- Advertisement -