- Advertisement -
అనకాపల్లి: చోడవరంలోని సబ్ జైలు నుంచి ఇద్దరు ఖైదీలు (Prisoners) శుక్రవారం పారిపోయిన విషయం తెలిసిందే. జైలు నుంచి తప్పించుకుపోయిన వాళ్లని ఒక్కరోజు తిరగకుండానే మళ్లీ అరెస్ట్ చేశారు. మాడుగుల చోరీ కేసులో రిమాండ్‌లో ఉన్న బెజవాడ రాము అనే ఖైదీ హెడ్ వార్డర్ వీర రాజు తలపై సుత్తితో దాడి చేశాడు. ఆ తర్వాత పింఛన్ డబ్బు కాజేసిన కేసులో రిమాండ్‌లో ఉన్న పంచాయతీరాజ్ మాజీ కార్యదర్శి నక్కా రవి కుమార్ రాజు నుంచి తాళల గుత్తి తీసుకున్నాడు. వీరిద్దరు కలిసి ప్రధాన ద్వారానికి తాళం వేసి పరార్ అయ్యారు. వారిని పట్టుకొనేందుకు పోలీసులకు ఎక్కువ సమయం పట్టలేదు. వీరిద్దరిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకొని అనకాపల్లి పోలీసులకు అప్పగించారు.
Also Read : హెడ్‌వార్డర్ తల బద్దలుకొట్టి.. జైలు నుంచి ఇద్దరు ఖైదీలు పరార్
- Advertisement -