Saturday, July 26, 2025

#SSMB29పై కీలక అప్‌డేట్ ఇచ్చిన పృథ్వీరాజ్

- Advertisement -
- Advertisement -

‘ఆర్ఆర్ఆర్’ వంటి గ్లోబల్ హిట్‌తో రికార్డులు తిరగరాశారు దర్శకధీరుడు రాజమౌళి. ప్రస్తుతం ఆయన సూపర్‌స్టార్ మహేశ్‌బాబుతో కలిసి సినిమా చేస్తున్నారు. ‘‘#SSMB29’’ అన వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా కొంత భాగం షూటింగ్ పూర్తయింది. ఈ సినిమాలో ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ‘సర్జమీన్’ అను సినిమాలో నటస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆయన #SSMB29 గురించి కూడా పలు విషయాలను వెల్లడించారు.

ఇప్పటివరకూ ఎవరూ ఊహించని రీతిలో #SSMB29 కథను రాజమఔళి తీర్చిదిద్దుతున్నారని పృథ్వీరాజ్ అన్నారు. అది ఒక దృశ్య కావ్యంగా ఉంటుందని పేర్కొన్నారు. రాజమౌళి ఎంచుకొనే కథలన్ని ఓ రేంజ్‌లో ఉంటాయన్న పృథ్వీరాజ్… ఈ సినిమా కూడా అదే రేంజ్‌లో ఉంటుందని తెలిపారు. రాజమౌళి ప్రతీ ఒక్కరిని అలరించేలా కథ చెప్పడంలో సిద్ధహస్తుడని.. ఈ సినిమాను ఓ విజువల్ ట్రీట్‌గా తీర్చి దిద్దుతున్నారని స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News