Friday, August 15, 2025

మన్సూరాబాద్‌లో ఓ ప్రవేట్ పాఠశాలలో దారుణం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ ఎల్బీనగర్: మన్సూరాబాద్‌లో ఓ ప్రవేట్ పాఠశాలలో దారుణం చోటు చేసుకున్న ఘటన ఆలోస్యంగా వెలుగులోకి వచ్చిన సంఘటన ఎల్బీనగర్ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. మన్సూరాబాద్ బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ పాఠశాలలో సాయినందన్ రెండోవ తరగతి చదువుకుంటున్నాడు. విద్యార్ది తండ్రి కృష్ణ చైతన్య రెడ్డి కథనం ప్రకారం చైతన్యపురికి చెందిన కృష్ణ చైతన్య రెడ్డి కూమారుడు సాయినందన్ (7) బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ పాఠశాలలో రెండోవ తరగతి చదువుతున్నాడు. విద్యార్ది గత కోన్ని రోజులుగా మౌనంగా ఉండటం, ఎవ్వరితో చనువుగా మాట్లడం లేదని వాపోయారు. అందోళనగా, భయంగా ఉండటంతో పాఠశాలకు వెళ్లాలంటే భయపడుతున్నాడు.

సుమారుగా నెల రోజులు నుంచి పాఠశాలకు వెళ్లడంలేదు. దీంతో తల్లి తండ్రులు అందోళన చెంది ,సైక్రియాట్రిస్టు వైద్యుని దగ్గరికి తీసుకెళ్లి చూపించారు. వేదించడంతో విద్యార్ది భయందోళనకు గురైయ్యాడని వైద్యుడు తెలిపారు. పదిహేను రోజుల క్రితం పాఠశాలకు వచ్చి సీసీ పుటేజీ చూపించాలని కోరాగా ,పాఠశాల యాజమాన్యం సీసీ పుటేజీ ఇవ్వడానికి నిరాకరించారు. వేరే మార్గాల ద్వారా సీసీ పుటేజీ పరిశీలించగా బాలుడిపై పెన్సిల్‌తో కండ్లలో కుచ్చడం, చేతిని మలుపు తిప్పడం, నోటికి టేపు వేయడం లాంటి దృశ్యాలు లభ్యమయ్యాయిని తెలిపారు. ఈ విద్యార్దితో పాటు మరో ఐదుగురు విద్యార్దులను టీచర్ వేధింపు చేసినట్లు తెలిపారు.

వెంటనే విషయాన్ని రంగారెడ్డి జిల్లా కలేక్టర్, డీఈఓ, బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ దృష్టికి తీసుకెళ్లామని పేర్కోన్నారు. కమిషన్ చైర్ పర్సన్ విచారణ చేపట్టి విద్యార్దిని వేధింపులకు గురి చేశారని, పాఠశాలకు నోటీసులు అందజేశారని తెలిపారు. దీనిపై న్యాయపరంగా పోరాటానికి సిద్దంగా ఉన్నానని, పాఠశాల యాజమాన్యం ఓక సారి పాఠశాలకు వచ్చి కలవాలని సూచించారని తెలిపారు. దీంతో పాఠశాలకు వస్తే పాఠశాల సెక్యూరీటీ సిబ్బంది దాడి చేశారని ఆరోపించారు. వెంటనే ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని తెలిపారు. పాఠశాల సిబ్బంది విద్యార్ది తండ్రి మరి కోంత మంది అకారణంగా స్కూల్‌లోకి వచ్చి సెక్యూరీటీ సిబ్బందిపై దాడి చేశారని పాఠశాల యాజమాన్యం ఎల్బీనగర్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఇరువురి ఫిర్యాదులు తీసుకోని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News