Friday, July 4, 2025

నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ దోపిడి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ఇల్లందు టౌన్‌ః జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు నిబంధనలకు విరుద్ధంగా ఆధిక ఫీజులు వసూలు చేస్తూ దోపిడికి పాల్పడుతున్నాయని వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మాదిగ యువసేన జిల్లా అధ్యక్షులు తాళ్ళ శివమాదిగ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన గురువారం మన తెలంగాణ దినపత్రికతో మాట్లాడుతూ విద్యాహక్కు చట్టం పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీటి విద్యార్ధులకు 25శాతం అడ్మిషన్లు ఉచితంగా ఇవ్వాలని చెబుతున్నప్పటికిని దానిని తుంగలో తొక్కుతూ విద్యాసంస్ధల యాజమానులు తల్లిదండ్రుల శ్రమను దోచుకుంటున్నారన్నారు.

దేశంలో విద్య వ్యాపారం కాదని దానిని అందరికి అందించాలని చట్టాలు చెబుతున్న పెడిచెవిన పెడుతూ ప్రైవేట్ విద్యాసంస్ధలు ధనార్జనే ధ్యేయంగా విద్యను వ్యాపారంగా మారుస్తున్నాయన్నారు. ఇటువంటి తరుణంలో ఎంతోమంది పేద విద్యార్ధులు చదువును కోనుక్కోలేక నానా ఇబ్బందులు పడుతూ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారన్నారు. తక్షణమే ప్రభుత్వం ప్రైవేట్ విద్యాసంస్ధలపై దృష్టి సారించి అధిక ఫీజుల వసూళ్ళకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోని విద్యార్ధులకు న్యాయం చేయాలన్నారు. లేనిపక్షంలో తెలంగాణ మాదిగ విద్యార్ధి యువసేన ఆధ్వర్యంలో ఉద్యమిస్తామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News