Monday, May 5, 2025

శ్రీతేజ్‌ను పరామర్శించిన అల్లు అరవింద్

- Advertisement -
- Advertisement -

‘పుష్ప 2’ మూవీ రిలీజ్ సందర్భంగా ఆర్టీసి క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో గాయపడిన బాలుడు శ్రీతేజ్‌ను అల్లుఅర్జున్ త్రండి, ప్రడ్యూసర్ అల్లు అరవింద్ పరామర్శించారు. మూడు నాలుగు రోజుల క్రితం కిమ్స్ ఆస్పత్రి నుంచి శ్రీతేజ్ ను డిశ్చార్జ్ చేశారు. 15 రోజుల పాటు రీహాబిలిటేషన్ సెంటర్‌లో ఉంచనున్నారు. ఈ క్రమంలో అరవింద్ సోమవారం రీహాబిలిటేషన్ సెంటర్‌ కు వెళ్లి శ్రీతేజ్ ను పరామర్శించారవు. ఈ సందర్భంగా అతని ఆరోగ్య పరిస్థితపై ఆరా తీశారు.

కాగా, సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో శ్రీతేజ్ తీవ్రంగా గాయపడగా.. అతని తల్లి రేవతి మృితి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా పెను సంచలనం సృస్టించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. అల్లుఅర్జున్ ను అరెస్ట్ చేసి జైలుకు తరలించడం హాట్ టాపిక్ అయ్యింది. ఈ ఘటనపై తెలంగాణలో పొలిటికల్ వార్ కూడా జరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News