విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘కింగ్డమ్’. ఈ సినిమా గురువారం (జూలై 31న) విడుదల కానుంది. స్పై యాక్షన్ మూవీగా ఈ సినిమాను రూపొందించారు దర్శకుడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ అన్నిటికీ మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా బుధవారం ఈ చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో భాగంగా నిర్మాత నాగవంశీని (Naga Vamsi) అడిగిన ప్రశ్నలకు ఆయన ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు.
ఈ చిత్రం హీరో రామ్ చరణ్ చేయాల్సిన సినిమానా అనే ప్రశ్నకు ‘లేదు రామ్ చరణ్‌కు గౌతమ్ చెప్పిన కథ వేరు’ అని సమాధానం ఇచ్చారు. ఇక కింగ్‌డమ్‌కి ప్రీమియర్స్ ఎందుకు లేవు అని ప్రశ్నించగా.. ‘శనివారం ట్రైలర్ విడుదల చేశాం. ఆదివారం నుంచి బుకింగ్స్ ఓపెన్ చేశాం. ఆడియన్స్ నుంచి మంచి స్పందన వచ్చింది. నైజాంలో ఉదయం 7 గంటల నుంచి షోలు మొదలవుతాయి. అందుకే ముందు రోజు ప్రీమియర్స్ అవసరం లేదని అనిపించింది’ అని నాగవంశీ (Naga Vamsi) అన్నారు. ఇక ఈ సినిమాలో భాగ్యశ్రీ భోర్సే హీరోయిన్‌గా నటిస్తుండగా.. సత్యదేవ్ కీలక పాత్ర పోషించారు. అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం అందించారు.