Wednesday, July 16, 2025

‘రామాయణ’ బడ్జెట్ ఎంతో చెప్పిన నిర్మాత.. ఎన్ని కోట్లో తెలిస్తే షాక్

- Advertisement -
- Advertisement -

నితీశ్ తివారి దర్శకత్వంలో ‘రామాయణ’ (Ramayana) సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మధ్యే ఈ సినిమాను పరిచయం చేస్తూ.. విడుదల చేసిన వీడియకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ వీడియోతో సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. అయితే ఈ సినిమా బడ్జెట్ గురించి చాలాకాలంగా చర్చ జరుగుతోంది. ఒకసారి రూ.835 కోట్లతో ఈ సినిమా నిర్మిస్తున్నారని ఓ టాక్ వచ్చింది. మరోసారి మొదటి భాగం రూ.900 కోట్లతో, రెండో భాగం రూ.700 కోట్లతో నిర్మిస్తున్నారని రూమర్స్ పుట్టుకొచ్చాయి. అయితే వీటన్నిటికీ నిర్మాత నమిత్ మల్హోత్రా ఫుల్‌స్టాప్ పెట్టారు. ఆయన రామాయణ బడ్జెట్ ఎంతో చెప్పేశారు.

ఏకంగా రూ.4000 కోట్లతో ఈ సినిమాను (Ramayana) నిర్మిస్తున్నారని నమిత్ పేర్కొన్నారు. ఇప్పటివరకూ ఇంత భారీ బడ్జెట్‌తో ఏ భారతీయ సినిమా రాలేదని.. ఈ సినిమాతో చరిత్ర సృష్టిస్తామని అన్నారు. సినిమా కోసం నిధులు సమకూర్చుకుంటున్నామని.. ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవాలని అనుకోవడం లేదని స్పష్టం చేశారు. ఏడు సంవత్సరాల క్రితమే ఈ సినిమా పనులు ప్రారంభించామని.. ప్రారంభించిన కొత్తలో తనను అంతా పిచ్చివాడని అనుకున్నారని తెలిపారు. ఏ భారతీయ సినిమా కూడా ‘రామాయణ’ దరిదాపుల్లోకి రాలేదని పేర్కొన్నారు. ప్రపంచమంతా ఈ సినిమాను చూడాలనే ఉద్దేశ్యంతోనే ఏకంగా రూ.4 వేల కోట్లతో ఈ సినిమాను రూపొందిస్తున్నామన్నారు.

హాలీవుడ్ చిత్రాల కంటే ఈ సినిమా బడ్జెట్ తక్కువే అని.. తరాలు మారినా యుగాలు మారినా రామాయణం ఎప్పటికీ ఓ గొప్ప ఇతిహాసమని తెలిపారు. భారతీయ సినిమాపై ప్రపంచం చిన్న చూపు చూస్తోందని.. ఈ సినిమాతో ప్రపంచమంతా భారత్‌పైపు చూస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇక ఈ సినిమాలో రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయిపల్లవి నటిస్తున్నారు. రావణుడి పాత్రలో కన్నడ స్టార్ యశ్, హనుమంతుడి పాత్రలో సన్నీ డియోల్ కనిపించనున్నారు. కైకేయి పాత్రలో లారా దత్తా, శూర్ఫణఖ పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమా తొలి భాగం 2026 దీపావళికి, రెండో భాగం 2027 దీపావళికి విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News