Sunday, September 14, 2025

ట్రైలర్, మొదటి పాట వచ్చేస్తున్నాయి..

- Advertisement -
- Advertisement -

ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘రాజాసాబ్’ సినిమా అప్‌డేట్స్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు బ్యాక్ టు బ్యాక్ అప్‌డేట్స్ ఇచ్చాడు నిర్మాత టీజీ విశ్వప్రసాద్. ట్రైలర్ రిలీజ్, సాంగ్ రిలీజ్ లాంటివన్నీ చెప్పుకొచ్చాడు. ‘రాజాసాబ్’ ట్రైలర్ సిద్ధమైందని ప్రకటించిన ఈ నిర్మాత.. ‘కాంతర- 2’ రిలీజ్ సందర్భంగా ఆ సినిమా ప్రదర్శితమయ్యే థియేటర్లలో ‘రాజాసాబ్’ ట్రైలర్‌ను కూడా ప్రదర్శిస్తామని ప్రకటించాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘మిరాయ్’లోని విజువల్ ఎఫెక్ట్‌కి మంచి స్పందన దక్కుతోంది. ఇదే నిర్మా ణ సంస్థ నుంచి రాబోతున్న రాజా సాబ్ సినిమాలో కూడా విజువల్ ఎఫెక్ట్‌కు మంచి ప్రాధాన్యత ఉంది. పీపుల్ మీడియా వారికి విడిగా విఎఫ్‌ఎక్స్ టీం కూడా ఉంది. వారి కష్టం మిరాయ్ లో కనిపించింది. కాబట్టి వచ్చే భారీ ప్రాజెక్ట్ ‘రాజా సాబ్’లో కూడా ఇదే రేంజ్ అవుట్‌పుట్ కనిపిస్తే ఈ పాన్ వరల్డ్ మూవీ ఘన విజయాన్ని అందుకోవడం ఖాయం. మొత్తానికి మాత్రం రాజా సాబ్ విజువల్స్ పరంగా కొత్త అంచనాలు ఇప్పుడు మొదలయ్యాయి.

ఇక ‘రాజాసాబ్’ ఫస్ట్ సాంగ్ గురించి టిజి విశ్వప్రసాద్ మాట్లాడుతూ… ప్రభా స్ పుట్టినరోజు నాడు ఫస్ట్ లిరికల్ వీడియోను విడుదల చేస్తామన్నాడు. అంటే అక్టోబర్ 23న ‘రాజాసాబ్’ మొదటి పాట రిలీజ్ అవుతుందన్నమాట. సంక్రాంతి కానుకగా జనవరి 9న ‘రాజాసాబ్’ కచ్చితంగా రిలీజ్ అవుతుందని ఇప్పటికే చిత్ర నిర్మాత ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ప్రభాస్ వెండితెరపై డ్యాన్స్ చేసి చాన్నాళ్లయింది. ఇటీవల వచ్చిన సినిమాల్లో అతడు డ్యా న్స్ చేసిన దాఖలాల్లేవు. ‘సలార్’ లాంటి సినిమా ల్లో అసలు డ్యూయట్లే లేవు. ఇలా చాన్నాళ్లుగా డ్యాన్స్‌కు దూరమయ్యాడు. ఎట్టకేలకు ఈ లో టును భర్తీ చేయబోతున్నాడు ప్రభాస్. ‘రాజా సా బ్’ సినిమాలో ప్రభాస్ పై ఓ మంచి డ్యాన్స్ నం బర్ ఉంది. ఈ పాటకు ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రాఫర్. ప్రస్తుతం ఈ సాంగ్ షూటింగ్‌లోనే ప్రభాస్ ఉన్నాడట. చాలా ఏళ్ల తర్వాత ప్రభాస్ ఈ సినిమాలో ఫాస్ట్‌గా డ్యాన్స్ చేశాడట. ఇక రొమాంటిక్ హారర్ జానర్‌లో దర్శకుడు మారుతి ‘రాజా సాబ్’ ను సమ్‌థింగ్ స్పెషల్‌గా తెరకెక్కిస్తున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News