- Advertisement -
అమరావతి: మన హిందూ జాతి మేల్కోవాలని, వేదాలను కాపాడుకోవాలని వైసిపి మాజీ మంత్రి భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. వేదమంటే మన భారతీయ సంస్కృతి అని అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఓ అధికారి అధికార గర్వంతో వేదాలను అవమానిస్తున్నారని, ఆ అధికారి అధికార గర్వాన్ని అడ్డుకోవాలని భూమన వేద పండితులకు సూచించారు. వేద పండితులు మన సనాతన, వేద వారసత్వాన్ని కాపాడుకోవాలన్నారు. (Preserving Vedic heritage) తాను రాజకీయం చేయడం లేదని మన వేదాలను కాపాడుకోవాలని చెబుతున్నానని అన్నారు. ఏడు యజుర్వేదాలు ఏడు కొండలయ్యాయని వేదాలు చెబుతున్నాయని, శ్రీవారి కొలువులో నాలుగు వేద పఠనాలు సాగుతుంటాయని భూమన కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు.
- Advertisement -