Sunday, July 27, 2025

రోడ్డు పనులు పూర్తి చేయాలని వరినాట్లతో నిరసన

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ / కందుకూరు ః అసంపూర్తిగా చేపట్టిన రోడ్డు పనులను పూర్తి చేయాలని మీర్‌ఖాన్‌పేట్ గ్రామస్థులు వినూత్నంగా రోడ్డుపై నిలిచిన నీటిలో వరినాట్లు వేసి నిరసన వ్యక్తం చేశారు. అనేక సంవత్సరాలుగా నిర్మాణంలో ఉన్న రోడ్డు వలన నిత్యం వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గుంతలమయమైన రోడ్డుపై ప్రయాణించాలంటే వాహనాలు ఎక్కడ అదుపుతప్పి ప్రమాదంలో పడుతామని ప్రాణాలను ఆరచేతిలో పెట్టుకోని ప్రయాణాలు సాగిస్తున్నారు. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో నిర్మించతలపెట్టిన ఫార్మాసీటిలో రవాణా సౌలభ్యం కోసం శ్రీశైలం హైవే కొత్తూరు గేట్ నుండి యాచారం నాగార్జున సాగర్ హైవేలను కలుపుతూ రెండులైన్ల రోడ్డు నిర్మాణం చేపట్టారు.

కాగా బేగరకంచ శివారు నుండి మీర్‌ఖాన్‌పేట్ మీదుగా యాచారం రోడ్డు పనులు కొన్ని కారణాల వలన నిలిచిపోవడంతో మట్టిరోడ్డు ప్రయాణాన్ని నేటికి సాగిస్తున్నారు. గతం వారం రోజులుగా కురుస్తున్నవర్షాలకు గతంలో ఉన్న గుంతల్లో నీరునిలిచి చిన్న చిన్న గుంతలు కాస్త పెద్దవిగా మారి ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. అనేకమార్లు రోడ్డు నిర్మాణ పనులు కొనసాగించాలని ప్రజలు అధికారుల దృష్టికి తీసుకేళ్లిన ఏలాంటి ప్రయోజనం లేకుండా పోవడంతో శనివారం గ్రామస్థులు వినూత్నంగా రోడ్డుపై వరినాట్లు నాటి నిరసన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు స్పందించి ఎండ్లుగా నిలిచిపోయిన రోడ్డు పనులను పూర్తిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిథులు, మహిళలు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News