Sunday, June 29, 2025

ఓ ఫోన్‌కాల్‌తో చిక్కులో లేడి ప్రధాని

- Advertisement -
- Advertisement -

థాయ్‌లాండ్‌లో నిరసనకారులు రోడ్లపైకి చేరారు. ప్రధాని పెటోనగటరన్ షిన్వత్రా రాజీనామాకు డిమాండ్ చేస్తూ బ్యాంకాక్‌లో ప్రదర్శనలు చెలరేగాయి. బ్యాంకాక్ వీధుల్లో రణరంగం పరిస్థితి ఏర్పడింది. కాంబోడియా మాజీ ప్రధాని హున్ సేన్‌తో దేశ ప్రధాని ఫోన్ కాల్ వీడియో లీక్ కావడంతో రాజకీయ సంక్షోభ పరిస్థితి నెలకొంది. అందాల యువతి షిన్వత్రా కాంబోడియా నేతతో దేశ సైనికాధికారుల నుంచి తనకు సాయం అందడం లేదని చెప్పడం తీవ్ర వివాదానికి దారితీసింది. ఇటీవలి ఓ సరిహద్దు వివాద పరిష్కారంలో కూడా ఆమె అసమర్థంగా వ్యవహరించారని విమర్శలు వెల్లువెత్తాయి.

ఆమె కాంబోడియా నేతతో బతిమలాటల ధోరణిలో మాట్లాడటం వంటి విషయాలతో స్థానికులలో ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం అవుతోంది. థాయ్‌లాండ్ అంతటా ఇప్పుడు ఫోన్‌కాల్ రికార్డు మార్మోగుతోంది. బ్యాంకాక్‌లో నిరసనకారులు జాతీయ జెండాలతో , పలు గుర్తులతో వీధుల్లోకి వచ్చారు. విజయస్మారక స్థలి వద్ద గుమికూడిన వారు జాతీయ గీతాల ఆలాపనతో గడిపారు. నృత్యాలతో వీధులు దద్దరిల్లాయి. ఏ నేతకు అయినా జాతీయతా భావం అత్యవసరం అని, ఇదే పాలకులకు ఉండాల్సిన కీలక లక్షణం అని నిరసనకారులు తెలిపారు. ప్రధాని తక్షణం రాజీనామా చేయాలని నినదించారు. బలహీనమైన ప్రధానితో జాతి ఆత్మవిశ్వాసం దెబ్బతింటుందని దూర ప్రాంతం నుంచి బ్యాంకాక్‌కు వచ్చిన ఓ గైడ్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News