న్యూఢిల్లీ: భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధవాతావరణం నెలకొనడంతో పాకిస్తాన్ సూపర్ లీగ్(PSL) మిగిలిన క్రికెట్ మ్యాచ్‌లను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)కి తరలించారు. గురువారం సాయంత్రం నుంచి భారత్ పై డ్రోన్స్, మిస్సైల్స్ తో దాడులక పాల్పడింది. దీంతో అప్రమత్తమూన భారత ఆర్మీ పాక దాడులను తిప్పికొట్టింది. పాక్ దాడులను ఎదుర్కొంటూనే భారత సాయుధ దళాలు రావల్పిండితో సహా పాకిస్తాన్‌లోని అనేక ప్రదేశాలలో ఎయిర్ డిఫెన్స్ రాడార్లు, వ్యవస్థలను లక్ష్యంగా దాడులు చేశాయి. ఈ దాడుల్లో ఓ డ్రోన్ పరికరం రావల్పిండి క్రికెట్ స్టేడియంలో పడింది. దీంతో నిన్న సాయంత్రం రావల్పిండి క్రికెట్ స్టేడియంలో పెషావర్ జల్మి, కరాచీ కింగ్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దు చేశారు.
ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) అధికారులు PSL మిగిలిన అన్ని మ్యాచ్‌లను UAEకి తరలిస్తున్నట్లు ధృవీకరించారు. మిగిలిన తేదీలు, వేదికల షెడ్యూల్ త్వరలోనే విడుదల చేయనున్నట్లు PCB శుక్రవారం వెల్లడించింది.