Wednesday, July 23, 2025

బాత్రూమ్‌లో యువతి స్నానం చేస్తుండగా చూశాడని యువకుడు హత్య

- Advertisement -
- Advertisement -

చెన్నై: యువతి బాత్రూమ్‌లో స్నానం చేస్తుండగా చూశాడని యువకుడిని నరికి చంపారు. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రం పుదుచ్చేరి బాగూర్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. పనైయడికుప్పంలో దినేష్‌బాబు(27) అనే వ్యక్తి నివసిస్తున్నాడు. దినేష్‌బాబు తన చెల్లి ఇటీవలే వివాహం చేశాడు. చెల్లి స్నానం చేస్తుండగా మేడపై నుంచి రాజగురు (34) అనే యువకుడు చూశాడు. దీంతో తన అన్నకు చెల్లి ఈ విషయం చెప్పింది. కరైయాంబదూర్-పనైయుడికుప్పం రోడ్డులో మోహన్‌రాజు అనే వ్యక్తి చేపల చెరువుకు సమీపంలో రాజుగురును దినేష్ బాబు తన స్నేహితులతో కలిసి హత్య చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దినేష్‌బాబును అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా తానే హత్య చేశానని ఒప్పుకున్నాడు. అతడితో పాటు అచ్యతన్, సుమిత్, ముఖిలన్, సహాశర్మను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News