- Advertisement -
ఛండీగఢ్: పంజాబ్‌లో వరద బీభత్సం సృష్టించింది. భారీ వర్షాలు కురవడంతో నదులు, కాలువలు ప్రమాదస్థాయిని దాటి ప్రవహించాయి. వరదలో కొట్టుకొనిపోయి ఇప్పటివరకు 37 మంది మృతి చెందారు. పంజాబ్ పలు గ్రామాలు నీళ్లలో మునిగిపోయాయి. రహదారులన్నీ జలమయంగా మారాయి. పశువులు వరదలలో కొట్టుకొనిపోయి వందల సంఖ్యలో చనిపోయి ఉంటాయని స్థానిక మీడియా వెల్లడించింది. పంజాబ్‌లో 37 ఏళ్ల తర్వాత భారీ వర్షపాతం నమోదైంది. 23 జిల్లాల్లో 1.75 లక్షల హెక్టార్ల పంట నష్టం జరిగింది. పంజాబ్ ప్రభుత్వం రూ.71 కోట్ల తక్షణ సాయం ప్రకటించింది. ఈ నెల 7 వరకు పంజాబ్‌లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. కేంద్రం నుంచి తక్షణమే సహాయం కావాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది.
- Advertisement -