Friday, July 18, 2025

కూలీని కోటీశ్వరుడిని చేసిన ఆరు రూపాయలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఎప్పుడు ఎవరికీ ఎలా అదృష్టం కలిసి వస్తుందో చెప్పలేం, ఒక్కోసారి రాత్రికి రాత్రే కొందరు కోటీశ్వరులు అవుతారు. ఓ కూలీ ఆరు రూపాయలు పెట్టి లాటరీ టికెట్ కొన్నాడు. ఆ టికెట్ అతడిని కోటీశ్వరుడిని చేసింది. ఆ టికెట్ అతడిని కోటీ రూపాయలు గెలుచుకునే విధంగా చేసింది. పంజాబ్ రాష్ట్రం మెగా జిల్లాకు చెందిన జస్మాయిల్ సింగ్ అనే వ్యక్తి ఇటుక బట్టీలో  కూలీగా పని చేసేవాడు. ఫిరోజ్‌పూర్‌ జిల్లాలోని జిరాలో ఆరు రూపాయలు పెట్టి 50ఇ42140 అనే నంబర్ లాటరీ టికెట్ కొన్నాడు.

ఆయన టికెట్ కొన్ని 24 గంటలకే నిర్వహకులు పోన్ చేసి కోటి రూపాయలు గెలుచుకున్నారని అతడికి సమాచారం ఇచ్చారు. ఈ వార్త తాను నమ్మలేకపోతున్నానని జస్మాయిల్ ఆనందం వ్యక్తం చేశాడు. వచ్చిన సొమ్ములతో రూ.25 లక్షల అప్పు తీర్చుకోవడంతో పాటు మిగిలిన డబ్బులు పిల్లల భవిష్యత్ కోసం ఉపయోగిస్తానని వివరణ ఇచ్చాడు. ముగ్గురు పిల్లలకు మంచి విద్యను అందిస్తానని చెప్పారు. జస్మాయిల్ కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. ఇప్పుడు తమ పిల్లలకు మంచి భవిష్యత్ ఇస్తామని జస్మాయిల్ భార్య విర్పాల్ కౌర్ వెల్లడించారు. ఇలాంటి రోజు వస్తుందని తాను ఎప్పుడు ఊహించలేదని కౌర్ పేర్కొన్నారు. ఫిరోజ్ పూర్ లో గతంలో నలుగురు లాటరీ టికెట్ గెలిచి కోటీశ్వరులు అయ్యారని నిర్వహకులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News