జైపూర్: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో(IPL) భాగంగా ఆదివారం డబుల్ హెడర్ మ్యాచులు జరుగుతున్నాయి. ఇందులో తొలి మ్యాచ్‌లో సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్(RR), పంజాబ్ కింగ్స్(PBKS) తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో పంజాబ్‌కి ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ టాస్ గెలిచి బ్యాటింగ్‌కి దిగింది. ఈ క్రమంలో తుషార్ దేశ్‌పాండే వేసిన రెండో ఓవర్‌లో ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య(9) హెట్మైర్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
ఆ తర్వాత మఫాకా వేసిన మూడో ఓవర్ చివరి బంతికి మిచెల్ ఓవెన్ పరుగులు చేయకుండానే పెవిలియన్ చేరాడు. అనంతరం తుషార్ దేశ్‌పాండే పంజాబ్‌కి మరో స్ట్రోక్ ఇచ్చాడు. నాలుగో ఓవర్ మొదటి బంతికి ఫామ్‌లో ఉన్న ప్రభ్‌సిమ్రన్(21) సంజూ శాంసన్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో నాలుగు ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ మూడు వికెట్ల నష్టానికి 43 పరుగులు చేసింది. క్రీజ్‌లో శ్రేయస్ అయ్యార్(5), నేహల్ వాదేరా(4) ఉన్నారు.