Monday, May 19, 2025

ఆఖరివరకూ పోరాడిన రాజస్థాన్.. పంజాబ్‌దే గెలుపు

- Advertisement -
- Advertisement -

జైపూర్: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో(IPL) 18వ సీజన్‌లో మరో ఆసక్తికర మ్యాచ్ జరిగింది. సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం వేదికగా.. రాజస్థాన్ రాయల్స్‌తో(RR) జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్‌(PBKS) 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. అనంతరం 220 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్‌కు ఓపెనర్లు వైభవ్, జైశ్వాల్‌లు శుభారంభం అందించారు. తొలి వికెట్‌కి వీరిద్దరు కలిసి 76 పరుగులు జోడించారు. అయితే 40 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద వైభవ్ ఔట్ అయ్యాడు.

ఆ తర్వాత బ్యాటింగ్‌కి వచ్చిన సంజూ శాంసన్, రియాగ్ పరాగ్ పెద్దగా రాణించలేకపోయారు. మరోవైపు జైశ్వాల్ 25 బంతుల్లోనే 9 ఫోర్లు 1 సిక్సుతో అర్థశతకం సాధించి ఔట్ అయ్యాడు. ఈ దశలో కష్టాల్లో పడిన జట్టుకి ధృవ్ జురేల్ అండగా నిలిచాడు. జట్టును విజయతీరాలకు చేర్చేందుకు పోరాడాడు. 31 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సులతో 53 పరుగులు చేశాడు. ఆఖర్లో బ్యాటింగ్ వచ్చిన వాళ్లు వెనువెంటనే పెవిలియన్ చేరారు. దీంతో ఫలితం మాత్రం పంజాబ్‌కే అనుకూలంగా వచ్చింది. రాజస్థాన్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 209 పరుగులు మాత్రమే చేయడంతో పంజాబ్ 10 పరుగుల తేడాతో ఈ మ్యాచ్‌లో విజయం సాధించింది. దీంతో పాయింట్ల పట్టికలో 17 పాయింట్లతో రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News