- Advertisement -
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటిస్తున్న కొత్త చిత్రం ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ నుంచి మరోసాంగ్ ను మేకర్స్ విడుదల చేశారు. పప్పి షేమ్ అంటూ సాగే ఈ పాటను సోమవారం రిలీజ్ చేశారు. ఈ సాంగ్ ను హీరో రామ్ పాడారు. ఇప్పటికే విడుదలైన తొలి సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో ఉపేంద్రకు వీరాభిమానిగా రామ్ నటిస్తున్నారు. ఈ సినిమాను ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ ఫేమ్ మహేష్ బాబు తెరకెక్కిస్తున్నారు. పీరియాడికల్ లవ్ స్టోరీ నేపథ్యంలో రాబోతున్న ఈ మూవీలో రామ్ కు జోడీగా భాగ్యశ్రీ బోర్సే నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ సినిమాలో ఉపేంద్ర, రావు రమేశ్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాగా, నవంబరు 28న ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది.
- Advertisement -