Thursday, July 31, 2025

సురారంలో నూతన షో రూమ్ ప్రారంభించిన ప్యూర్ ఈవీ

- Advertisement -
- Advertisement -

సురారాం: భారతదేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీదారులలో ఒకటైన ప్యూర్, సూరారంలో తమ సరికొత్త షోరూమ్‌ను ప్రారంభించినట్లు వెల్లడించింది. దక్షిణ భారతదేశంలో తమ కార్యకలాపాలను విస్తరించాలనే ప్యూర్ యొక్క వ్యూహాత్మక లక్ష్యంలో ఈ విస్తరణ ఒక ముఖ్యమైన ముందడుగును సూచిస్తుంది. తెలంగాణలోని మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా, సూరారంలోని ఎస్ బి ఐ బ్యాంక్ ఎదురుగా ఉన్న ఫ్లాట్ నంబర్ 02-68 వద్ద ఉన్న షోరూమ్, ప్యూర్ యొక్క ePluto 7G Max మరియు eTryst Xతో సహా ప్యూర్ ఈవీ యొక్క సమగ్ర శ్రేణి ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను ప్రదర్శిస్తుంది. సురారం ప్రజలకు అసమానమైన ఎలక్ట్రిక్ రైడింగ్ అనుభవాన్ని అందించడానికి ప్యూర్ ఈవీ సిద్ధంగా ఉంది.

ఈ షోరూమ్ ప్రారంభం ప్యూర్ ఈవీ వేగవంతమైన విస్తరణ వ్యూహానికి నిదర్శనం, భారతదేశ వ్యాప్తంగా తమ కార్యకలాపాలను గణనీయంగా విస్తరించటం తో పాటుగా, విస్తృత శ్రేణిలో విద్యుత్ రవాణా వాహనాలను అందుబాటులోకి తీసుకురావడం ప్యూర్ ఈవీ లక్ష్యంగా పెట్టుకుంది. స్వదేశీ ఆర్ &డి, తయారీపై దృష్టి సారించి, ప్యూర్ ఈవీ ఆవిష్కరణలను వేగవంతం చేయటానికి, పర్యావరణ ఎంపికలు చేసుకునేలా వినియోగదారులను శక్తివంతం చేయడానికి కట్టుబడి ఉంది.

రాబోయే 30 నెలల్లో 250 కొత్త డీలర్‌షిప్‌లను తెరవడం, దాని జాతీయ నెట్‌వర్క్‌ను 320 కి పైగా అవుట్‌లెట్‌లకు విస్తరించడం అనే ప్యూర్ యొక్క విస్తృత ప్రణాళికలో భాగంగా ఈ విస్తరణ జరుగుతుంది. సూరారంలో ఈ కొత్త షో రూమ్ ప్రారంభంతో, స్వచ్ఛ రవాణా దిశగా భారతదేశం యొక్క పరివర్తనకు మద్దతు ఇవ్వడంలో కీలక పాత్ర పోషిస్తూనే ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News