హైదరాబాద్ ఫిల్మ్ స్టూడియోలో ఇద్దరు పవర్‌హౌస్ స్టార్‌లు కలుసుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కలుసుకున్న సందర్భం రెండు యూనిట్లకూ ఎనర్జీని నింపింది. చిరంజీవి ప్రస్తుతం హైదరాబాద్‌లో అని ల్ రావిపూడి దర్శకత్వంలో మన శంకరవర ప్రసాద్ కోసం ఒక కలర్ ఫుల్ పాట చిత్రీకరణలో ఉన్నారు. మెగాస్టార్, నయనతారలపై ఈ సాంగ్ షూట్ చేస్తున్నారు. అదే కాంప్లెక్స్‌లోని సమీపంలోని విజయ్ సేతుపతి, పూరి జగన్నాధ్ కలిసి చేస్తున్న మూవీ షూటింగ్ జరుగుతోంది. ఇందులో టబు కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. షూటింగ్ మధ్యలో స్టార్స్ కలుసుకోవడంతో సెట్‌లో మరింత ఎనర్జీ పెరిగింది. ఈ సందర్భం ఫ్యాన్స్‌కి విజువల్ ఫీస్ట్‌గా మారింది.
చిరంజీవి స్టైలిష్ సూట్‌లో చరిష్మాటిక్‌గా కనిపిస్తే, విజయ్ సేతుపతి తన సిగ్నేచర్ స్టైల్‌లో లుంగీ లుక్‌తో కూల్‌గా కనిపించారు. ఫోటోలో చిరంజీవి, – విజయ్ సేతుపతితో పాటు డైరెక్టర్స్ అనిల్ రావిపూడి, పూరి జగన్నాథ్, అలాగే చార్మీ కౌర్, బ్రహ్మాజీ, విటివి గణేష్ కూడా చిరునవ్వుతో దర్శనమిచ్చారు. నయనతార, టబులు కూడా కనిపించి మైమరపించారు. ‘మన శంకర వర ప్రసాద్ గారు’ 2026 సంక్రాంతికి గ్రాండ్ రిలీజ్‌కి రెడీ అవుతుండగా, విజయ్ సేతుపతి, – పూరి జగన్నాథ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 2026 ఆరంభంలో థియేటర్లలోకి రావడానికి ప్లాన్ చేస్తున్నారు.