Saturday, May 3, 2025

ఉక్రెయిన్ తో చర్చలకు రష్యా సిద్ధమే కానీ షరతులు వర్తిస్తాయి: పుతిన్

- Advertisement -
- Advertisement -

మాస్కో: ఉక్రెయిన్ తో రష్యా చర్చలకు సిద్ధమేనని రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ తెలిపారు. ఉక్రెయిన్ ఆగస్టులో రష్యాలోని కుర్స్క్ ప్రాంతంలోకి అనూహ్యంగా సరిహద్దు చొరబాట్లను ప్రారంభించింది, సరిహద్దు మీదుగా వేలాది మంది సైనికులను పంపి అనేక గ్రామాలను స్వాధీనం చేసుకుంది. అప్పుడు చర్చలకు సిద్ధంగా లేమని పుతిన్ తెలపారు.

రష్యాలోని వ్లాడివోస్టాక్ నగరంలో జరిగిన ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరమ్‌లో జరిగిన ప్రశ్నోత్తరాల సెషన్‌లో పుతిన్ మాట్లాడుతూ, రష్యా చర్చలకు సిద్ధంగా ఉందని, అయితే 2022లో ఇస్తాంబుల్ లో కుదిరిన, తర్వాత రద్దయిన రష్యా, కైవ్ ఒప్పందం ఆధారంగానే చర్చలు జరుపుతామని, నాటి ఒప్పందం నిబంధనలను ఎన్నడూ బహిర్గతం చేయలేదని అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News