Tuesday, September 16, 2025

అశ్విన్‌కు భారీ షాక్..

- Advertisement -
- Advertisement -

రాజస్థాన్ రాయల్స్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్‌కు భారీ షాక్ తగిలింది. చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌షోతో అదరగొట్టి ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచిన అశ్విన్‌కు మ్యాచ్ ఫీజులో భారీ కోత పడింది. మ్యాచ్ సందర్భంగా అంపైర్లు బంతిని మార్చడంపై అశ్విన్ బహిరంగ విమర్శలకు దిగాడు.

Also Read: ధోని బాదిన మూడు సిక్స్‌లు… రికార్డు బద్దలు

ఐపిఎల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉల్లంఘనగా పరిగణించిన మ్యాచ్ రిఫరీ జవగల్ శ్రీనాథ్ రాజస్థాన్ బౌలర్ ఫీజులో 25 శాతం కోత విధించారు. అంతేగాక స్లో ఓవర్‌రేట్ కారణంగా రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్‌కు కూడా రిఫరీ రూ.12 లక్షల జరిమానా విధించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News