Friday, May 16, 2025

టెస్ట్ కెప్టెన్ గా రవీంద్ర జడేజా నా ఎంపిక: అశ్విన్

- Advertisement -
- Advertisement -

ఇంగ్లడ్ లో టీమిండియా పర్యటనకు ముందు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి రిటైర్ మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తర్వాత టెస్ట్ కెప్టెన్ ఎవరనే విషయంపై సర్వత్రా అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ రేసులో జస్ ప్రీత్ బుమ్రా, శుభమన్ గిల్ పేర్లు వినిపించాయి. సీనియర్ ఆటగాడు రవీంద్ర జడేజాను టెస్ట్ కెప్టెన్ గా తన ఎంపిక అని అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు. ప్రస్తుతం జడేజా టీమిండియాలో సీనియర్ ఆటగాడని, కొత్త వ్యక్తిని కెప్టెన్ గా చేయాలనుకుంటే రెండు సంవత్సరాలు అతడు జడేజా మార్గదర్శకత్వంలో శిక్షణ పొందేలా చూడాలన్నారు. అంతలోపు ఆ వ్యక్తి వైస్ కెప్టెన్ గా బాధ్యతలు నిర్వహించాలి. ఇది నా వైల్డ్ కార్డ్ ఎంపిక అని అశ్విన్ అన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News