Saturday, July 19, 2025

పవన్‌పై ఎవరు కుట్ర పన్నుతారు: ఆర్ నారాయణ మూర్తి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సినీ పరిశ్రమను గౌరవించినందుకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి నటుడు ఆర్ నారాయణ మూర్తి ధన్యవాదాలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లోనూ అవార్డులు ప్రకటించాలని, ఎపి ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆఫీస్‌ నుంచి ప్రకటన, దుర్గేష్ వ్యాఖ్యలు సరికాదన్నారు. కష్టాలపై మాట్లాడుకుందామని పిలిచి ఉంటే బాగుండేదని, థియేటర్ల బంద్‌ అని ఎవరూ ప్రకటించలేదని, బంద్‌ ప్రకటిస్తే మూడు వారాల ముందే నోటీసులు ఇవ్వాలన్నారు.

పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లుపై కుట్ర చేశారని ఎలా అంటారని, పవన్‌పై ఎవరు కుట్ర పన్నుతారని ఆర్ నారాయణ మూర్తి ప్రశ్నించారు. టికెట్ రేట్లు పెంచొద్దని కూడా చెప్పామని, రేట్లు పెంచేస్తే సామాన్యులు థియేటర్లకు ఎలా వస్తారని, సింగిల్‌ థియేటర్లకు పర్సంటేజ్‌ విధానం కావాలని, అద్దె విధానం తొలగించాలని ఎప్పుడో డిమాండ్ చేశామని, పర్సంటేజ్‌ విధానానికి నిర్మాత దిల్‌రాజు ఒప్పుకున్నారని ఆర్ నారాయణ మూర్తి గుర్తు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News