- Advertisement -
హైదరాబాద్: టాలీవుడ్ హీరోయిన్ రాశీ ఖన్నా షూటింగ్లో రిహార్సిల్స్ చేస్తుండగా గాయపడ్డారు. రాశీ తన సోషల్ మీడియాలో ఖాతాలో పోస్టు చేశారు. ఒక్కో సారి కథ డిమాండ్ చేస్తే గాయాలను చేయకుండా కష్టపడాల్సి వస్తుందని చెప్పారు. షూటింగ్ చేస్తుండగా చిన్న చిన్న గాయాలయ్యాయని ఆమె తెలిపారు. ఆ ఫొటోల్లో రాశీ ఖన్నా ముఖం, చేతులపై గాయాలు ఉన్నాయి. ఫర్జీ-2 అనే వెబ్ సిరీస్లో ఆమె నటిస్తోంది. రాశీ ఖన్నా గాయపడడంతో ఆమె అభిమానులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. రిష్క్ షాట్లు చేసేటప్పుడు డూప్ ను పెట్టుకుంటే బాగుంటుందని అభిమానులు ఆమెకు సలహా ఇస్తున్నారు.
- Advertisement -