- Advertisement -
హరీష్ శంకర్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఆధ్వర్యంలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న విషయం తెలిసిందే. రాజకీయాలలో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ పెండింగ్ లో ఉన్న ప్రాజెక్ట్ లను పూర్తి చేస్తున్నారు. ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ షూటింగ్ శరవేగంగా నడుస్తుంది. కాగా ఈ మూవీలో శ్రీ లీల హీరోయిన్ గా కనిపించబోతున్నారు. ఈ మూవీలో హీరోయిన్ రాశి ఖన్నా కూడా కీలక పాత్రలో కనించబోతున్నట్లు సమాచారం. ఈ మేరకు చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేసింది. ఇందులో భాగంగానే రాశి ఖన్నా పోస్టర్ ను రీలీజ్ చేశారు. ఈ మూవీలో రాశి ఖన్నా శ్లోక అనే పాత్రలో ఫోటోగ్రఫీ జర్నలిస్టుగా కనిపించబోతుంది. ప్రస్తుతం రాశీ ఖన్నా హైదరాబాద్ లో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటోంది.
- Advertisement -