స్టార్ కొరియోగ్రాఫర్, హీరో, డైరెక్టర్‌గా సినిమాల్లో తనదైన ముద్ర వేశారు రాఘవ లారెన్స్ (Raghava Lawrence). అయితే ఆయనని సినిమా పరంగానే కాకుండా.. ఆయన చేసే సేవలకు ఎక్కువగా ఇష్టపడుతుంటారు ఫ్యాన్స్. ఎవరికైనా బాధల్లో ఉన్నారని.. తెలిస్తే వాళ్లని ఆదుకొనేందుకు లారెన్స్ ముందుంటారు. ఇటీవలే కూతురి చదువుకోసం చనిపోయిన భార్య మంగళసూత్రం తాకట్టుపెట్టిన ఓ తండ్రి గురించి తెలుసుకున్న లారెన్స్.. ఆ మంగళసూత్రం విడిపించమే కాకుండా.. ఆ కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. తాజాగా ఓ దివ్యాంగురాలి విషయంలోనూ ఆయన తన గొప్ప మనస్సును చాటుకున్నారు.
పూరి గుడిసెలో ఉంటున్న శ్వేత అనే దివ్యాంగురాలకి సాయం చేసేందుకు లారెన్స్ (Raghava Lawrence) ముందుకు వచ్చారు. ఆమె నడవలేని స్థితిలో ఉంటే ఆమె కాలికి సపోర్ట్‌గా ఉండే పరికరాన్ని ఇచ్చి నడిచేలా చేశారు. తాజాగా ఆమె ఎక్కడికైనా వెళ్లేందుకు వీలుగా స్కూటీని బహుమతిగా ఇచ్చారు. ఆమెకు ఇంకా సహాయం చేయాలని లారెన్స్ బలంగా నిర్ణయించుకున్నారు. శ్వేతను గుడిసె నుంచి మంచి ఇంటికి మారేలా చేయాలని సంకల్పించారు. అందుకోసం ఇంటి నిర్మాణం కోసం అడ్వాన్స్ కూడా ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో కూడా షేర్ చేశారు. ఇది చూసిన అభిమానులు లారెన్స్ గొప్ప మనస్సును మెచ్చుకుంటూ కామెంట్లు చేస్తున్నారు.
Also Read : ‘కిష్కింధపురి’ లాంటి హారర్ థ్రిల్లర్ ఇప్పటివరకూ రాలేదు