Wednesday, July 16, 2025

రాహుల్‌కి ఈ జన్మలో ప్రధాని అయ్యే అవకాశం లేదు: కిషన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సైన్యం విజయాన్ని రేవంత్ రెడ్డి తక్కువ చేసి మాట్లాడటం దుర్మార్గం అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) అన్నారు.. నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘మన పాకిస్థాన్’ అని అన్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి మనస్సులో ఏముందో అదే బయటకు వచ్చిందని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీకి ఈ జన్మలో ప్రధాని అయ్యే అవకాశం లేదని పేర్కొన్నారు. అసలు పివొకెను పాకిస్థాన్‌కు ఎవరు ఇచ్చారు అని ప్రశ్నించారు. కాంగ్రెస్ వల్లే పివొకె అంశం ఇంకా రావణ కాష్టంగా రగులుతూనే ఉందని అన్నారు.

ఉగ్రవాదులు దాడి చేస్తే.. గత కాంగ్రెస్ ప్రభుత్వాల్లా సంతాపాలతో సరిపుచ్చుకోలేదని కిషన్‌రెడ్డి (Kishan Reddy) తెలిపారు. మోదీ సర్కార్ పాక్ భూభాగంలోకి వెళ్లి మరీ సర్జికల్ స్ట్రయిక్స్ చేసిందని అన్నారు. పహల్గాం దాడి తర్వాత పాకిస్థాన్‌కు ఎలా నరకం చూపించామో ప్రపంచం మొత్తం చూసిందని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News