Monday, May 5, 2025

కులగణన జరగాలని ఎప్పటి నుంచో రాహుల్ డిమాండ్ చేశారు: షర్మిల

- Advertisement -
- Advertisement -

అమరావతి: బిసిల నుంచి కూడా కులగణన చేయాలనే డిమాండ్ పెరిగిందని ఎపి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల తెలిపారు. కూటమి ప్రభుత్వంలో రైతులకు మద్దతు ధర రావడం లేదని విమర్శించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ..పంటల వారీగా మద్దతు ధర ప్రభుత్వం ఇస్తున్నా, ధర వ్యత్యాసాలను చూపిస్తూ, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ షర్మిల ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు దేశ వ్యాప్తంగా కులగణనకు ఒప్పుకున్నట్లు ప్రకటించారని షర్మిల అన్నారు. కాంగ్రెస్ తరపున తాము స్వాగతిస్తున్నామని చెప్పారు. ఇది సాధ్యం అయ్యిందంటే కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీనే కారణమని తెలియజేశారు. కులగణన జరగాలని ఎప్పటి నుంచో రాహుల్ డిమాండ్ చేశారని అన్నారు. కులగణన జరిగితేనే ఆర్థికంగా అన్ని కులాల వారికి మేలు చేసేలా సాయం చేయవచ్చునని షర్మిల స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News