పహల్గామ్ దాడి, ఆపరేషన్ సిందూర్‌పై చర్చకు విపక్షం పట్టు
అధికార, విపక్ష సభ్యుల నినాదాలతో సభలో గందరగోళం లోక్‌సభలో
వాయిదాల పర్వం వచ్చే వారం ఆపరేషన్ సిందూర్‌పై చర్చకు కేంద్రం
సంసిద్ధత ఆపరేషన్ సిందూర్‌తో మేకిన్ ఇండియా ప్రాముఖ్యత
ప్రపంచానికి తెలిసివచ్చింది : ప్రధాని మోడీ విపక్షనేత హోదా ఉన్నా..
సభలో మాట్లాడనివ్వటం లేదు ప్రభుత్వంపై రాహుల్ ధ్వజం
న్యూఢిల్లీ:పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సో మవారం వాయిదాల పర్వంతో ఆరంభం అయిం ది. ఆపరేషన్ సింధూర ఇతర విషయాలపై తక్షణ చర్చకు ప్రతిపక్షాలు తొలిరోజున పట్టుపట్టాయి. దీనితో లోక్‌సభ పలు మార్లు వాయిదా పడి, నాలుగోసారి ఈ రోజుకు అర్థాంతరంగా ముగిసింది. నె ల రోజుల వర్షాకాల సమావేశాలు సోమవారం ఆ రంభం అయ్యాయి. లోక్‌సభ ఆరంభం కాగానే వి పక్షాలు చర్చకు పట్టుపట్టాయి. అధికార , విపక్ష సభ్యుల మధ్య పరస్పర కేకలు, నిరసనలతో గందరగోళం నెలకొంది. దేశ భద్రత విషయాలపై జాతి కి ప్రభుత్వం నుంచి సభ ద్వారా వివరణ అవసరం అని ప్రతిపక్షాలు తెలిపాయి. వెంటనే ఆపరేషన్ సింధూర్‌పై చర్చకు అనుమతి కావాలని కోరాయి. నాలుగోసారి సభ కొలువు దీరిన తరువాత సభాధ్యక్ష స్థానంలో ఉన్కన దిలీప్ సైకియా ప్రతిపక్షాలకు సభ సజావుగా సాగేలా చూడాలని పదేపదే విజ్ఞప్తి చేశారు. గోవా అసెంబ్లీ స్థానాల సర్దుబాటు ప్రక్రియ బిల్లు ప్రవేశపెట్టేందుకు సహకరించాలని కోరారు. అయితే ప్రతిపక్షాలు పట్టించుకోలేదు. ఉ గ్రవాద దాడి తదనంతర ఆపరేషన్ సింధూర్ పరిణామాలలోని నిజానిజాలు వెలుగులోకి రావల్సి ఉందని ప్రతిపక్షాలు స్పష్టం చేశాయి.
దీనితో సభ వాయిదా పడింది. స్పీకర్ అనుమతించే అన్ని విషయాలపై సమగ్ర చర్చ ఉంటుందని, ప్రతిపక్షాలు సహకరించాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తె లిపారు. ఏ విషయంపై అయినా ప్రభుత్వం సుదీర్ఘ చర్చలకు సిద్ధంగా ఉందని ప్రతిపక్షాలకు హామీ ఇచ్చారు. అన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయని, ముందు సభ సజావుగా సాగేలా చూడాలని తెలిపారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజూ కూడా ఇదే విధమైన ప్రకటన వెలువరించారు. బిజినెస్ అడ్వయిజరీ కమిటీ (బిఎసి) సమావేశంలో అంగీకారం కుదిరే అన్ని అంశాలపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, దీని మేరకే సభ కార్యక్రమాలు నిర్ణీత రీతిలో సజావుగా సాగుతాయని వివరించారు. అయితే ఈ దశలో సభ్యులు చాలా మంది తమ స్థానాల నుంచి వెల్‌లోకి వెళ్లారు. వారంతా తమ స్థానాలకు వెళ్లాలని సభాధ్యక్ష స్థానంలో ఉన్న జగదాంబిక పాల్ విజ్ఞప్తి చేశారు. ప్రజలు అంతా కూడా పార్లమెంట్ సెషన్‌ను గమనిస్తున్నారని, ప్రజా ప్రతినిధుల పనితీరు ఏ విధంగా ఉందనేది గుర్తించారని చెప్పారు. ప్రభుత్వం అన్ని విషయాలపై మాట్లాడేందుకు సిద్ధంగా ఉందనేది , ప్రతిపక్షాలు సభ సాగకుండా చేయాలనే రీతిన వ్యవహరిస్తున్నది అందరికీ తెలిసిపోయిందని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న రాహుల్ గాంధీ తమ వారిని వెనకకు రప్పించాల్సి ఉందని తెలిపారు.
గోల చేయాలనుకంపటే బయలకు వెళ్లండి : స్పీకర్
సోమవారం ఉదయం 11 గంటలకు ఉభయ సభలు ప్రారంభం అయ్యాయి. సంతాప ప్రస్తావనల తరువాత ప్రతిపక్షాలు వెంటనే ఆపరేషన్ సింధూర్ అంశాన్ని ప్రస్తావించాయి, చర్చకు పట్టుపట్టాయి. అయితే అన్ని అంశాలపై చర్చ ఉంటుందని స్పీకర్ చెప్పారు. క్వశ్చన్ అవర్ కానివ్వండని కోరారు. సభా నియమ నిబంధనల మేరకు చర్చ ఉంటుందన్నారు.క్వశ్చన్ అవర్‌లో ప్రజలకు సంబంధించిన పలు సమస్యలు, ప్రభుత్వ విభాగాల చర్యలపై ప్రశ్నలకు వీలుంటుంది. ఇది ప్రజలకు అవసరం అని స్పీకర్ తెలిపారు. సభ్యులు ముందు నోటీసు వెలువరించాల్సి ఉంటుంది.
దీనిని బట్టి సభ్యులు ఎంతసేపైనా ఏ విషయంపై ఉన్నా చర్చకు అవకాశం ఉంటుందన్నారు. గౌరవ సభ్యులు ఇది క్వశ్చన్ అవర్ అని గుర్తుంచుకుంటే ఈ విధంగా వ్యవహరించడం జరగదన్నారు. కావాలనే రాద్థాంతానికి దిగి, సభలో కేకలు అరుపులు నినాదాలకు దిగితే ప్రయోజనం లేదన్నారు. నినాదాలకు దిగాలనుకుంటే సభ వెలుపలికి వెళ్లి చేసుకోవచ్చునని హెచ్చరించారు. ప్రతిపక్షాలకు ఆపరేషన్ సింధూర్‌పై చర్చ కావాలనుకుంటే , ముందు క్వశ్చన్ అవర్ సాగాల్సిందే . దీని తరువాత తాను చర్చకు అనుమతిని ఇస్తానని స్పీకర్ చెప్పారు. ప్రభుత్వం అన్ని విషయాలపై సమాధానాలకు సిద్ధంగా ఉందన్నారు. ప్రతిపక్షాలు కూడా చర్చకు సిద్ధం కావాల్సి ఉందన్నారు.