న్యూఢిల్లీ: భారత్ జోడో యాత్రలో భాగంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై (Rahul Gandhi) నమోదైన కేసులో ఆయనకు ఊరట లభించింది. భారత ఆర్మీని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారనే పరువు నష్టం కేసులో రాహుల్‌కు లక్నో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు రాహుల్ న్యాయవాదులు రూ.20 వేల పూచీకత్తు, రెండు బాండ్లను సమర్పించారు. తదుపరి విచారణను కోర్టు ఆగస్టు 13కు వాయిదా వేసింది.
డిసెంబర్ 16, 2022న భారత్ జోడో యాత్రలో అరుణాచల్ ప్రదేశ్‌లో భారత సైనికులను చైనా ఆర్మీ కొడుతున్నా భారత ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని రాహుల్ (Rahul Gandhi) అన్నారు. ఎల్‌వొసి వెంబడి చైనా చర్యలకు భారత్ అడ్డుకట్ట వేయలేకపోతుందని రాహుల్ వ్యాఖ్యానించారు. దీంతో రాహుల్ చేసిన వ్యాఖ్యలు భారత సైన్యాన్ని కించపరిచేలా ఉన్నాయని బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ మాజీ డైరెక్టర్ ఉదయ్ శంక్ శ్రీవాస్తవ తరఫున వివేక్ తివారీ అనే న్యాయవాది రాహుల్‌పై ఫిర్యాదు చేశారు.
జూరు