Wednesday, September 3, 2025

ర్యాలీలో బైక్ కోల్పోయిన వ్యక్తి.. కొత్త బైక్‌ని ఇచ్చిన రాహుల్

- Advertisement -
- Advertisement -

పాట్నా: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఇటీవల ‘ఓటర్ అధికార్ యాత్ర’ చేపట్టిన విషయం తెలిసిందే. ఆగస్టు 27న దర్భంగాలో ఈ ర్యాలీ జరిగింది. అయితే ఈ ర్యాలీలో ఓ హోటల్ యజమాని తన బైక్‌ని పోగొట్టుకున్నాడు. ఇది తెలిసి రాహుల్ ఆయనకు కొత్త బైక్‌ని బహుమతిగా ఇచ్చారు. హోటల్ యజమాని శుభమ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. తొలుత భద్రతా సిబ్బంది టీ తాగడం కోసం వచ్చారు. ఆ తర్వాత ర్యాలీకి బైక్ కావాలని అడిగారు. ర్యాలీ కేవలం 1.5 కిలోమీటర్లు మాత్రమే ఉంటుందని ఆ తర్వాత బైక్ తిరిగి ఇచ్చేస్తామని హామీ ఇచ్చారు.

అయితే తన బైక్‌పై శుభమ్‌ని కూడా భద్రతా సిబ్బంది తీసుకెళ్లారు. కొంత సమయం తర్వాత ఎస్‌యువి‌లోకి మారమని కోరారు. ఆ తర్వాత చూస్తే.. ర్యాలీ ముగిసిన తర్వాత శుభమ్ బైక్, భద్రతా సిబ్బంది ఎక్కడా కనిపించలేదు. తర్వాత సిబ్బంది ఆరు బైక్‌లను స్వాధీనం చేసుకోగా.. అందులో శుభమ్ బైక్ లేదు. ఈ విషయం కాంగ్రెస్ నాయకుడు దేవేంద్ర యాదవ్‌కు తెలిసింది. వెంటనే అతనికి శుభమ్‌ని పాట్నా రావాల్సిందిగా ఆహ్వానించారు. ఓటర్ అధికార్ యాత్ర ముగింపు కార్యక్రమ వేదికపై రాహుల్ (Rahul Gandhi) స్వయంగా తనకు కొత్త బైక్ తాళాలు అందించినట్లు శుభమ్ తెలిపారు. తాను కోల్పోయిన బైక్ మోడల్‌నే బహుమతిగా ఇచ్చారని పేర్కొన్నారు.

Also Read : చనిపోయిన నా తల్లిని రాజకీయాల్లోకి లాగారు: మోడీ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News