Saturday, July 26, 2025

పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి బెయిల్

- Advertisement -
- Advertisement -

హిందూత్వ సిద్ధాంతకర్త, స్వాతంత్య్ర సమరయోధుడు వి.డి. సావర్కర్‌పై 2022లో భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ చేసిన అనుచిత వ్యాఖ్యలపై పరువు నష్టం కేసు దాఖలయింది. అయితే ఆ కేసులో మహారాష్ట్రలోని నాసిక్ కోర్టు గురువారం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. చీప్ జుడీషియల్ మెజిస్ట్రేట్ ఆర్.సి.నర్వాడియా ముందు వీడియో ద్వారా హాజరయిన లోక్‌సభలోని ప్రతిపక్షనాయకుడు రాహుల్ గాంధీ ‘నిర్దోషిని’ అని వాదించారు. నాసిక్‌కు చెందిన దేవేంద్ర భుటాడ తన లాయర్ మనోజ్ పింగ్లే ద్వారా ఇండియన్ పినల్ కోడ్ 500,

504 కింద క్రిమినల్ పరువు నష్టం కేసు వేశారు. రాహుల్ గాంధీ తాను నిర్దోషినని వాదించాక, ఆయన తరఫు న్యాయవాది ఆయనకు బెయిల్ ఇవ్వాలని కోరారు. హింగోలిలోని విలేకరుల సమావేశంలో, 2022లో భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ ‘సావర్కర్ ముకులిత హస్తాలతో తనను విడుదలచేయమని కోరారు, తర్వాత తాను బ్రిటిష్ ప్రభుత్వానికి అనుగుణంగా పనిచేస్తానని అన్నారని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు’ అని ఫిర్యాదుదారుడు తన పరువునష్టం దావాలో పేర్కొన్నారు. సావర్కర్ మనుమడు పూణేలో దాఖలు చేసిన మరో పరువు నష్టం దావాను కూడా రాహుల్ గాంధీ ఎదుర్కొంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News