Sunday, April 28, 2024

కేంద్రం రైతులను బెదిరిస్తోంది: రాహుల్ గాంధీ

- Advertisement -
- Advertisement -

Rahul Gandhi press conference

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం రైతులను బెదిరిస్తోందని కాంగ్రెస్ నేత రాహల్ గాంధీ అన్నారు. అవసరమైతే సాగు చట్టాలను రెండేళ్లు వాయిదా వేస్తామంటున్నారని రాహుల్ విమర్శించారు. ఆయన బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ… రైతులకు కేంద్రం భయపడుతుందా…? ఢిల్లీని ఎందుకు అష్టదిగ్భందం చేస్తున్నారని ప్రశ్నించారు. రైతుల గోడును కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా వినాలని రాహుల్ డిమాండ్ చేశారు. రక్షణ రంగానికి బడ్జెట్ లో సరిగా నిధులు కేటాయించలేదన్నారు. భారత్ లోకి వేల కిలమీటర్లు చైనా చొచ్చుకొస్తోంది. చైనాతో ఉద్రిక్తతలు ఉన్న సమయంలో రక్షణ రంగాన్ని పట్టించుకోరా..? అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో 10,15 మందికే ప్రయోజనం చేకూరుతుందని స్పష్టం చేశారు. కేంద్రం దేశ ఆర్ధిక వ్యవస్థను నాశనం చేస్తుందని మండిపడ్డారు. కరోనా సమయంలో దేశఆర్థిక వ్యవస్థ మందగించిందని రాహుల్ గుర్తుచేశారు. ఎంఎస్ఎంఇలను ఆదుకునే దిశాగా ప్రభుత్వ చర్యలు శూన్యమన్నారు. కేంద్రం నిధులు మంజూరు చేస్తే పరిశ్రమలు నిలదొక్కుకునేవని రాహల్ వ్యాఖ్యనించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News