ఈర్షతో , అభద్రతత అని బిజెపి విమర్శ
న్యూఢిల్లీ: ఉగ్రవాదంపై వ్యతిరేకంగా ప్రపంచ స్థాయి దౌత్యానికి కేంద్రంతలపెట్టిన దౌత్య బృందాల వ్యవహారం వివాదాస్పదం అయింది. ఈ ప్రతినిధి బృందంలో చేరేందుకు కాంగ్రెస్ అంగీకరించింది. అయితే తమ పార్టీ తరఫున బృందంలో ఉండే సభ్యుల పేర్లను తెలిపే క్రమంలో ఎంపి శశి థరూర్ పేరు చేర్చలేదు. నలుగురు ఎంపిల పేర్లను కేంద్ర ప్రభుత్వానికిపార్టీ పంపించింది. అయితే రాహుల్ స్వయంగా పంపించిన పేర్ల జాబితాలో థరూర్ పేరు చేర్చలేదని వెల్లడైంది.
ఆనంద్‌శర్మ, గౌరవ్ గగోయ్, డాక్టర్ సయ్యద్ నసీర్ హుస్సేన్, రాజా బ్రార్ పేర్లతో పార్టీ జాబితా పంపించారు. అయితే ఈ జాబితాలో లేని శశి థరూర్‌ను కేంద్రం ప్రతినిధి బృందంలోకి తీసుకుంది. అంతేకాకుండా ఆయనఅఖిల పక్ష ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తారని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వశాఖ తెలిపింది. ఆయన తిరువనంతపురం నుంచి నాలుగు సార్లు ఎంపిగా ఉన్న ఘనత వహించారు . కాగా సీనియర్ ఎంపి థరూర్ పేరు లేకుండా కాంగ్రెస్ పార్టీ ఎంపిల జాబితాను పంపించడాన్ని బిజెపి తప్పుపట్టింది. పలు విధాలుగా ఈ పేర్ల వ్యవహారం ప్రశ్నార్థకంగా ఉందని బిజెపి అధికార ప్రతినిధి అమిత్ మాలవ్యా స్పందించారు.
శశి థరూర్ ప్రముఖ వక్త. ఆయన సందర్భోత సమయస్ఫూర్తి, ఏ దేశం వెళ్లినా అక్కడి భాషల్లో కూడా మాట్లాడగలిగే సత్తా సంతరించుకుని ఉన్న సీనియర్ ఎంపి అని పార్టీ ఐటి ఇన్‌చార్జి అయిన మాలవ్యా తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకించి రాహుల్ గాంధీ కావాలనే థరూర్ పేరు పక్కకు పెట్టారని, ఎందుకు ఇదంతా ? ఇది రాహుల్ అభద్రతా భావమా? లేక థరూర్ పట్ల ఈర్షనా, లేదా హై కమాండ్‌ను తనను కాదని ఎదిగిపోయే వారిని సహించలేని అసహనమా అని ప్రశ్నించారు.