Thursday, July 17, 2025

అవినీతి రాజా సిఎం శర్మ జైలుకే: రాహుల్ గాంధీ

- Advertisement -
- Advertisement -

గువహతి ః అస్సాం సిఎం హిమంత బిస్వా శర్మ తనను తాను రాజా అనుకుంటారు. అయితే ఈ రాజాను కూడా ఆయన అవినీతి పనులకు అస్సామీలు జైలుకు పంపిస్తారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తెలిపారు. అవినీతి రాజా రాజరికం ఎక్కువ కాలం సాగదన్నారు. రాష్ట్రంలోని ఛాయ్‌గాన్‌లో బుధవారం జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో రాహుల్ మాట్లాడారు. శర్మ ఆయన కుటుంబం చేసిన అవినీతికి బాధ్యత వహించాల్సిందే అన్నారు. ఇప్పటికే ఆయనలో జైలు భయం పట్టుకుంది. భయం లేని కాంగ్రెస్ కార్యకర్తలు తనను జైలులో పెడుతారనే భయం శర్మకు పట్టుకుందని వ్యాఖ్యానించారు.

ఇక బిజెపి, ఎన్నికల సంఘం రెండూ ములాఖత్ అయి పనిచేస్తున్నాయి. ఏదో విధంగా బిజెపిని అధికారంలోకి తేవడమే ఎన్నికల సంఘం పని అఇందని మరోసారి ఆయన ఆరోపించారు. ఈ కలయికలో భాగంగానే మహారాష్ట్రలో ఓటర్ల జాబితా సవరణ చేయించుకుని బిజెపి గెలిచిందని విమర్శించారు. ఇదే వ్యూహం ఇప్పుడు బీహార్‌లో , తరువాత అస్సాంలో అమలు చేస్తారని ఆయన ఎన్నికల సంఘంపై తీవ్రస్థాయి విమర్శలకు దిగారు. ఓటర్ల జాబితాల పట్ల ఇక్కడి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యేకించి కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు అప్రమత్తత అవసరం అన్నారు. వచ్చే ఏడాది అస్సాంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి.

మీడియా నిజాలు చెప్పడం లేదు
ఈ రోజుల్లో మీడియా నిజాలు చెప్పడం లేదు. వాస్తవాలు రాయడం లేదు. మనకు మీడియా దూరం అయింది. నిజాలు తెలియచేయకుండా వారు ఎప్పుడూ అదానీ, అంబానీని, ఇక్కడి సిఎంను, మోడీని, షాను ఆకాశానికి ఎత్తివేస్తున్నారు. నేలమీది వాస్తవాలకు దూరంగా ఉంటున్నారని ఆరోపించారు. అయితే ఎన్నికల సంఘం వ్యవహారాలు కానీ, మీడియా తప్పుడుదారి కానీ కాంగ్రెస్‌ను ఏమీ చేయలేవని, అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభజంనం తప్పదని జోస్యం చెప్పారు. దేశంలో సిద్ధాంతాల వైరం సాగుతోంది. విద్వేష విభజనల ఆర్‌ఎస్‌ఎస్ ఓ వైపు, సత్యం అహింసల కాంగ్రెస్ మరో వైపు నిలిచాయని రాహుల్ చెప్పారు. బిజెపి పాలనతో ఇప్పుడు రెండు హిందూస్థాన్‌లు వెలిశాయి. ఒకటి కొందరు బిలియనీర్లతో కూడినది, వారు విలాస వివాహాలు, విందులు వినోదాలు సాగుతుంటాయి. మరో వైపు సామాన్యుడు పన్నుల మోతలతో, ధరల వాతలతో వేగుతుంటాడని వ్యాఖ్యానించారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, ఉపాధి లేమితనం ఉందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News