Wednesday, July 16, 2025

ఈ దేశం మోడీ సమాధానాన్ని కోరుతోంది.. మౌనాన్ని కాదు: రాహుల్ గాంధీ ఫైర్

- Advertisement -
- Advertisement -

ఇది ఆత్మహత్య కాదు, వ్యవస్థీకృత హత్య
ఒడిశా విద్యార్థిని ఆత్మహత్యపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ధ్వజం

న్యూఢిల్లీ: ఒడిశాలో లెక్చరర్ వేధింపులు తాళలేక, కాలేజి ప్రాంగణంలోనే ఒంటికి నిప్పంటించుకున్న యువతి మూడు రోజులు మృత్యువుతో పోరాడి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. ఇతి ఆత్మహత్య కాదని, వ్యవస్థీకృత హత్య అని భారతీయ జనతా పార్టీపై మండిపడ్డారు. బాధితురాలిని రక్షించడంలో ఒడిశాలో అధికార బిజెపి ప్రభుత్వం విఫలమైందని మంగళవారం ఎక్స్ వేదికగా రాహుల్‌గాంధీ మండిపడ్డారు.

‘ఒడిశాలో న్యాయం కోసం బాధిత విద్యార్థిని ధైర్యంగా, లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా తన గళాన్ని వినిపించింది. అందుకు ఆమెకు న్యాయం చేయడానికి బదులు బెదిరించి హింసించారు. పదేపదే అవమానించారు. ఎప్పటిలాగే బిజెపి వ్యవస్థ నిందితుడిని కాపాడేందుకు ప్రయత్నిస్తోంది. ఒక అమాయకురాలైన విద్యార్థిని తనకు తానే నిప్పంటించుకునేలా చేసింది. ఇది ఆత్మహత్య కాదు, వ్యవస్థీకృత హత్య. మోడీజీ.. ఒడిశాలో లేదా మణిపూర్‌లోనైనా సరే.. దేశంలో కుమార్తెలు కాలిపోతున్నారు. ప్రాణాలు కోల్పోతున్నారు. మీరు ఇంకా మౌనంగానే ఉంటారా?దేశానికి మీ మౌనం అవసరం లేదు. సమాధానాలు కావాలి’ అంటూ హిందీలో ఉంచిన పోస్టులో రాహుల్ రాసుకొచ్చారు.

ఈ దేశ ఆడకూతుళ్లు భద్రతను, న్యాయాన్ని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. ఒడిశా ఆడబిడ్డ బిజెపి ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందన్న ఆశను వదులుకుందని, ఈ లోకాన్ని కూడా వదిలిపెట్టి వెళ్లిందని కాంగ్రెస్ కమ్యూనికేషన్ విభాగం ఇన్‌చార్జి జైరాం రమేశ్‌మండిపడ్డారు. కాగా పార్టీ మరో ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ సైతం విద్యార్థిని మృతిపై రాష్ట్రంలోని బిజెపి ప్రభుత్వంపై మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News