జమ్మూ కశ్మీర్‌లోని పూంచ్ ప్రాంతంలో కాంగ్రెస్ నాయకులు ,ఎంపి రాహుల్ గాంధీ శనివారం పర్యటించారు. ఈ ప్రాంతంపై పాకిస్థాన్ బలగాలు కొద్ది రోజుల క్రితం బాంబు దాడులకు దిగాయి. దాడుల బాధిత కుటుంబాలను రాహుల్ పరామర్శించారు. ఈ ప్రాంతం వారికి కనివిని ఎరుగని రీతిలో నష్టం వాటిల్లింది. ఇది పెను విషాదం నింపిందని స్పందించారు. ఈ నెల 7 నుంచి 10వ తేదీ మధ్యలో పాకిస్థాన్ బలగాలు ఈ ప్రాంతాన్ని లక్షంగా ఎంచుకుని దాడికి దిగాయి. వైమానిక దాడులు , బాంబు మోతలతో ఈ ప్రాంతం దద్దరిల్లింది, పాక్ సైన్యం పౌర ప్రాంతాల పై నేరుగా దాడులకు దిగింది. ఇక్కడి బాధితులను తాను కలిసినట్లు , బాధితులతో గంటకు పైగా మాట్లాడినట్లు వివరించారు. ఇక్కడి ప్రజలను తాను కలిసినప్పుడు వారి కడగండ్ల గురించి అర్థం అయిందని వివరించారు. ఇక్కడి వారు కోరినట్లు తాను ఈ దాడుల విషయాన్ని జాతీయ స్థాయిలో ప్రస్తావించనున్నట్లు తెలిపారు
గాయపడ్డ పూంచ్‌కు న్యాయం కావాలి:రాహుల్ గాంధీ
- Advertisement -
- Advertisement -
- Advertisement -