Sunday, August 3, 2025

150 సీట్లు దాటనివ్వం

- Advertisement -
- Advertisement -

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బిజెపిని చిత్తు చేస్తాం
మోడీని ఓడించడానికి కాంగ్రెస్ కుటుంబం సిద్ధం
ప్రధాని పీఠం నుంచి మోడీని దించగలిగేది
రాహుల్ ఒక్కడే 26 ఏళ్లుగా పదవులు
పట్టుకువేలాడుతున్న నరేంద్ర మోడీ దేశం కోసం
గాంధీ, ఇందిర, రాజీవ్ ప్రాణత్యాగం చేశారు
రాహుల్‌గాంధీని ప్రధానిని చేసి తీరుతాం
అధికారం లేకపోతే బిజెపి ఇంటికే పరిమితం
అధికారం ఉన్నా…లేకున్నా జనంలోనే కాంగ్రెస్
ఢిల్లీలో రాజ్యాంగంపై జరిగిన సదస్సులో
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్ : మోడీని దించడం బిజెపి, సంఘ్ పరివార్ నేతల వల్ల కాదని, మోడీని పదవి నుంచి దించబోయేది రాహుల్ గాంధీ మాత్రమేనని సిఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. వచ్చే ఎన్నిక ల్లో మోడీని ఓడించి దేశాన్ని, రాజ్యాంగాన్ని, సామాజిక న్యాయాన్ని కాపాడుతామన్నారు. మోడీ లేకుం డా బిజెపి150 సీట్లు గెలవదని ఇటీవలే బిజెపి ఎంపి నిశికాంత్ దూబే చెప్పారని ఆయన అన్నారు. నిశికాంత్ దూబే రాసిపెట్టుకోండి వచ్చే ఎన్నికల్లో రాహు ల్ గాంధీ మోడీతో తలపడితే బిజెపికి 150 కంటే ఒక్క సీటు ఎక్కువ రాకుండా అడ్డుకునేందుకు కాం గ్రెస్ కుటుంబం సిద్ధంగా ఉందన్నారు. భారత్ జోడో యాత్రలో సామాజిక న్యాయం గురించి రాహుల్ గాంధీ మాట్లాడారని తెలంగాణలో కాంగ్రెస్ ప్ర భుత్వం ఏర్పడిందని తాము కులగణన చేసి చూ పించా మని సిఎం రేవంత్‌రెడ్డి అన్నారు. భారత దేశానికి తెలంగాణ మోడల్ చూపించామని, రాబోయే రోజుల్లో ఈ దేశంలో సామాజిక న్యాయం కోసం రా హుల్ గాంధీ నేతృత్వంలో కులగణన చేసి తీరుతామని, ఈ దేశంలో కొత్త సామాజిక న్యాయం చేసి చూపుతామని ఆయన తెలిపారు. శనివారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఏఐసిసి ఆధ్వర్యంలో నిర్వహించిన కానిస్టిట్యూషనల్ ఛాలెంజెస్ పర్‌స్పెక్టివ్స్ అండ్ పాథ్‌వేస్ సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.

ఉగ్రవాదుల నుంచి దేశాన్ని ఇందిరాగాంధీ రక్షించింది
ఈ సందర్భంగా సిఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఈ దేశానికి స్వాతంత్రం రాకముందే కాంగ్రెస్ పార్టీ ఉందని, బ్రిటిష్ వాళ్లతో పోరాడి దేశానికి స్వాతంత్య్రం తీసుకువచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని ఈ విషయాన్ని బిజెపి వాళ్లకు గుర్తు చేస్తున్నానని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఇందిరాగాంధీ పాకిస్తాన్ ను యుద్ధంలో ఓడించి రెండు ముక్కలు చేసి కాళీమాతగా గుర్తింపుపొందారని సిఎం రేవంత్ పేర్కొన్నారు. ఉగ్రవాదుల నుంచి దేశాన్ని ఇందిరాగాంధీ రక్షించిందని, ఉగ్రవాదుల నుంచి రక్షించే క్రమంలో ఇందిరాగాంధీ ప్రాణాలు త్యాగం చేశారని సిఎం రేవంత్ తెలిపారు. ఉగ్రవాదంపై పోరులో రాజీవ్ గాంధీ అమరత్వం పొందారని, వచ్చే ఎన్నికల్లో ప్రధానమంత్రి మోడీని, బిజెపిని కాంగ్రెస్ ఓడిస్తుందని ఆయన పేర్కొనారు. కాంగ్రెస్ ఏం చేసిందని పదే పదే బిజెపి వాళ్లు ప్రశ్నిస్తున్నారని, ఈ దేశం కోసం గాంధీజీ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలు ప్రాణ త్యాగాలు చేశారని ముఖ్యమంత్రి రేవంత్ చెప్పుకొచ్చారు.

రాహుల్ గాంధీ ప్రధాని కావాలనుకుంటే ఎప్పుడో అయ్యేవారు
బిజెపి సహా మిగతా పార్టీలు అధికారం లేకపోతే ఇంటికి పరిమితం అవుతాయని సిఎం ఎద్దేవా చేశారు. కానీ, అధికారం ఉన్నా లేకపోయినా కాంగ్రెస్ ఎప్పుడూ ప్రజా పక్షంలో నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రధాని పదవిని త్యాగం చేసిన ఘనత సోనియా గాంధీ అని ఆయన చెప్పారు. దేశం కోసం మన్మోహన్ ను ప్రధానిని చేశారని ఆయన తెలిపారు. రాష్ట్రపతి అవకాశం వచ్చినా వదులుకొని ప్రణబ్ ముఖర్జీని రాష్ట్రపతి చేశారని ఆయన అన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని కావాలనుకుంటే ఎప్పుడో అయ్యేవారని, యూపిఏ ప్రభుత్వ హయాంలో అవకాశం వచ్చినా కేంద్ర మంత్రి పదవిని, ప్రధాన మంత్రి పదవిని తీసుకోకుండా సీనియర్లకు అవకాశం ఇచ్చి తాను కార్యకర్తలా పేదల కోసం పని చేస్తున్నారని ఆయన తెలిపారు.’

మోడీని దింపాలని ఆర్‌ఎస్‌ఎస్ ప్రయత్నం
ఓ వైపు రాహుల్ గాంధీ బడుగు, బలహీన వర్గాలు, దళితులు, ఆదివాసీ, ఓబిసిల సామాజిక న్యాయం కోసం పోరాటం చేస్తుంటే మరోవైపు నరేంద్ర మోడీ 26 ఏళ్లుగా పదవులు వదులుకోవడం లేదని సిఎం రేవంత్ ఆరోపించారు. 2001 లో గుజరాత్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇప్పటి వరకు మోడీని తప్పించాలని ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి నేతలు ప్రయత్నం చేస్తున్నారన్నారు. కానీ, నరేంద్ర మోడీ మాత్రం పదవిని వదులుకోవడం లేదని ఆయన విమర్శించారు. 75 ఏళ్ల తర్వాత పదవిలో ఉండొద్దని ఇటీవలే మోహన్ భగవత్ చెప్పారని, అయినా మోడీ మాత్రం తన కుర్చీ వదులుకోవడానికి సిద్ధంగా లేరని ఆయన ఆరోపించారు. గతంలో అద్వానీ, మురళీ మనోహర్‌కు వర్తించిన వయస్సు మోడీకి వర్తించదా అని ఆయన ప్రశ్నించారు.

రాహుల్ గాంధీ దేశ ప్రధాని అవుతారు
రాహుల్ గాంధీని భారత ప్రధానిని చేసి తీరుతామని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. గతంలో దేశానికి ప్రధాని అయ్యే ఛాన్స్ వచ్చిన రాహుల్ గాంధీ వదులుకున్నారని, కానీ, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని, రాహుల్ గాంధీ దేశ ప్రధాని అవుతారని సిఎం రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు. మోడీని తరిమికొట్టి భారత రాజ్యాంగాన్ని రక్షిస్తామని సిఎం రేవంత్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News