మన తెలంగాణ/కారేపల్లిః కారేపల్లి మండల పరిధిలోని ఉసిరికాయలపల్లి గ్రామంలోని కోట మైసమ్మ ఆలయ పరిసర ప్రాంతంలో పేకాట స్థావరంపై పోలీసుస్‌లు జరిపిన దాడిలో 6 మోటార్ బైక్‌లు, 9 సెల్ ఫోన్‌లతోపాటు నగదు పట్టుకున్నారు. దీనికి సంబంధించిన ఎస్సై బైరు గోపి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి… కారేపల్లి ఎస్సై బైరు గోపి ఆధ్వర్యంలో పోలీస్‌లు ఆదివారం పెట్రోలింగ్ చేస్తున్న క్రమంలో సింగరేణి మండలం ఉసిరికాయలపల్లి గ్రామ సమీపంలో గల కోట మైసమ్మ ఆలయ పరిసరాల్లో పేకాట స్థావరంపై దాడి చేశారు. ఈ క్రమంలో ఆ ప్రాంతంలో ఇల్లందుకు చెందిన 12 మంది వ్యక్తులు పేకాడుతూ దొరికారు. వారి వద్ద నుండి 6 మోటార్ సైకిళ్ళు, 9 సెల్ ఫోన్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా 25 వేల 700 నగదు పట్టుకున్నారు. దీనికి సంబంధించి వారిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బి గోపి తెలిపారు. ఈ దాడుల్లో కానిస్టేబుళ్లు భూక్య శంకర్, హరి, ఓంకార్, సైదులు తదితరులు ఉన్నారు.
పేకాట స్థావరంపై దాడి.. 12 మందిపై కేసు..
- Advertisement -
- Advertisement -
- Advertisement -