బర్మింగ్‌హామ్: భారత్, ఇంగ్లండ్ (Ind vs Eng) మధ్య ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించింది. రెండో టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో అద్భుతంగా రాణించిన భారత్.. ఇంగ్లండ్‌కు 608 పరుగుల భారీ లక్ష్యాన్ని ముందుంచింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 72 పరుగులు చేసి మూడు వికెట్లు కోల్పోయింది. ఐదో రోజు ఆట వర్షం కారణంగా నిలిచిపోయింది. ఇంగ్లండ్ ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలంటే.. ఇంకా 536 పరుగులు చేయాలి. ప్రస్తుతం క్రీజ్‌లో పోప్(24), బ్రూక్ (15) ఉన్నారు.
ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో భారత్ (Ind vs Eng) 587 పరుగులు చేసింది. బ్యాటింగ్‌లో శుభ్‌మాన్ గిల్ 269, జడేజా 89, జైస్వాల్ 87, సుందర్ 42 పరుగులు చేశారు. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 407 పరుగులకు ఆలౌట్ అయింది. ఇంగ్లండ్ బ్యాటింగ్‌లో జెమీ స్మిత్ 184, బ్రూక్ 158 పరుగులు చేయగా.. మిగితా బ్యాటర్లు స్వల్పస్కోర్‌కే పరిమితమయ్యారు.