- Advertisement -
హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసింది. ముషీరాబాద్, చిక్కడపల్లి, ఆర్టిసి క్రాస్ రోడ్, బాగ్ లింగంపల్లి, రామ్ నగర్, విద్యానగర్, సికింద్రాబాద్, బోయిన్‌పల్లి, తిరుమలగిరి, అల్వాల్, ప్యాట్నీ, ప్యారడైజ్, నాగారం ప్రాంతాల్లో వర్షం కురిసింది. నగరంలోని పలు ప్రాంతాలు మేఘావృతమై ఉన్నాయి. ఈదురుగాలులు బలంగా వీస్తున్నాయి. వర్షం కురిసిన ప్రాంతాల్లో తీవ్రంగా ట్రాఫిక్ జామ్ అయింది.
- Advertisement -