Monday, July 28, 2025

హైదరాబాద్‌లో భారీ వర్షం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో గురువారం వేకువజామున నుంచి భారీ వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి. వర్షపు నీటితో రోడ్లు నిండిపోయాయి. రాకపోకలను అంతరాయం కావడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. జిహెచ్ ఎంసి సిబ్బంది లోతట్టు ప్రాంతాలలో సహాయక చర్యలు చేపట్టారు. నాలుగు రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర కోస్తాంధ్ర ప్రాంతంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల వాతావరణం ఏర్పడిందని వాతావరణ శాఖ పేర్కొంది. 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News