Wednesday, June 25, 2025

అదరగొడుతున్న ఇంగ్లండ్ ఓపెనర్లు.. బెన్ డక్కెట్ శతకం..

- Advertisement -
- Advertisement -

లీడ్స్: హెడ్డింగ్లే వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో విజయం సాధించడంలో ప్రస్తుతానికి ఇంగ్లండ్ ముందంజలో ఉంది. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ నిర్ధేశించిన 371 పరుగుల విజయలక్ష్యాన్ని చేరుకోవడంలో ఇంగ్లండ్ ఓపెనర్లు తమ దూకుడును చూపిస్తున్నారు. ఐదో రోజు 21 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్‌ని ఆరంభించిన ఇంగ్లండ్ ఓపెనర్లు బెన్ డక్కెట్ (Ben Duckett), జాక్ క్రాలీ.. కట్టుదిట్టంగా బ్యాటింగ్ చేస్తున్నారు.

వీరిద్దరి వికెట్ తీసేందుకు భారత బౌలర్లు నానా తంటాలు పడుతున్నారు. బౌలింగ్‌లో ఎన్ని మార్పులు చేసినా.. ఈ ఓపెనింగ్ జోడీ భాగస్వామ్యాన్ని మాత్రం విడదీయలేకపోతున్నారు. డక్కెట్, క్రాలీ ఒకరి తర్వాత ఒకరు భారత బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నారు. ఈ క్రమంలో డక్కెట్ (Ben Duckett) 121 బంతుల్లో శతకం సాధించాడు. క్రాలీ అంతకు ముందే అర్థ శతకం పూర్తి చేశాడు. అయితే ప్రస్తుతానికి వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోయింది. కాసేపటికి మళ్లీ తిరిగి ప్రారంభమైంది. ప్రస్తుతం 41 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లండ్ వికెట్ నష్టపోకుండా 181 పరుగులు చేసింది. క్రీజ్‌లో డక్కెట్ (105), క్రాలీ (59) ఉన్నారు. ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలంటే ఇంగ్లండ్‌ ఇంకా 190 పరుగులు చేయాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News