Monday, July 7, 2025

అల్పపీడన ద్రోణి ప్రభావం.. తెలంగాణలో 3 రోజులపాటు వర్షాలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణితో రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. సోమవారం రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. దీంతో పాటు మరో రెండు రోజులు రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News