Saturday, July 26, 2025

అలర్ట్.. తెలంగాణలో నాలుగు రోజులు వర్షాలు

- Advertisement -
- Advertisement -

తెలంగాణలో ఇకనుంచి విస్తారంగా వర్షాలు కురిస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం సూచించింది. రాబోయే నాలుగు రోజులు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.మరికొన్ని జిల్లాల్లో ఈదురు గాలులతో కూడి వానలు పడతాయని.. ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఆదివారం ఉమ్మడి కరీనంగర్, వరంగల్, ఆదిలాబాద్, హైదరాబాద్, మహబూబ్ నగర్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కాగా, నిన్న రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురిసింది. వర్షాలు పడే అవకాశం ఉండటంతో ప్రభుత్వం అధికారులను అప్రమత్తం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News